ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-06-25T05:29:23+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 3,700 గ్రామాలో ఆరులక్షల మంది రైతులు ప్రకృతిసేద్యం చేస్తున్నట్లు రైతుసాధికారిత సమితి వైస్‌చైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.విజయకుమార్‌ తెలిపారు.

ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం
ప్రసంగిస్తున్న విజయకుమార్‌, వేదికపైన లక్ష్మీనారాయణ, యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు

రైతుసాధికారిత సమితి వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌

గుంటూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 3,700 గ్రామాలో ఆరులక్షల మంది రైతులు ప్రకృతిసేద్యం చేస్తున్నట్లు రైతుసాధికారిత సమితి వైస్‌చైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.విజయకుమార్‌ తెలిపారు. ఈఏడాది పది లక్షలమంది రైతులతో ప్రకృతిసేద్యం చేయించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించినట్లు చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో శుక్రవారం సేంద్రియ మేళా 2022ను ఆయన ప్రారంభించారు. విజయకుమార్‌ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులద్వారా సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలను చేపడుతున్నట్లు తెలిపారు. విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన కషాయాలు, జీవామృతాన్ని ప్రభుత్వం డ్వాక్రాసంఘాల ద్వారా తయారుచేయించి, ఆర్‌బీకేలలో అమ్మకాలు చేపట్టాలన్నారు. రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో  గోఆధారిత వ్యవసాయదారుల సంఘం ఏపీ అధ్యక్షుడు రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్‌సంఘ్‌ ఏపీ అధ్యక్షుడు పరిమి రాఘవులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కు మారస్వామి, స్వదేశ్‌ జాగరణ్‌ మంచ్‌ ఏపీ కన్వీనర్‌ నరసింహరాజు,  తలపాటి సురేంద్రబాబు, రావిపాటి హనుమంతరావు, కౌటిల్య, లాం శాస్త్రవేత్త డాక్టర్‌ ఆదినారాయణ,  విశ్రాంత డీడీ తిరపయ్య, మలిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T05:29:23+05:30 IST