ఈనెల 25 నుంచి రైతు పోరు: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-03-21T22:13:43+05:30 IST

కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా

ఈనెల 25 నుంచి రైతు పోరు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి టీఆర్ఎస్ ఆధ్యర్యంలో రైతు పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.  ఈ సందర్భంగా కేంద్రంగా విరుచుకు పడ్డారు. అనేక అంశాలపై స్పందించారు. ఈ భేటీలో ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు అంశంపై నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలుపై ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. రైతులు వేసే పంటలన్నింటికీ కేంద్రం గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలన్నారు. లీగల్ సమస్యలు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామన్నారు. ఈ నెల 28న నేతలంతా యాదాద్రి ఉద్ఘాటనకు రావాలని కేసీఆర్ సూచించారు. 



Updated Date - 2022-03-21T22:13:43+05:30 IST