కార్మిక, కర్షక సదస్సును జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-04-18T06:03:30+05:30 IST

కార్మిక, కర్షక సదస్సును జయప్రదం చేయండి

కార్మిక, కర్షక సదస్సును జయప్రదం చేయండి
సన్నాహక సమావేశంలో రైతు సంఘ నేతలు

 హనుమాన్‌జంక్షన్‌, ఏప్రిల్‌ 17: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ  ఢిల్లీలో సుధీర్ఘపోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 19న విజయవాడలో జరగనున్న కర్షక, కార్మిక శంఖారావం సదస్సును జయప్రదం చేయాలని హనుమాన్‌ జంక్షన్‌  రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు ఇచ్చింది. శనివారం స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఆవరణలో సదస్సును జయప్రదం చేసేందుకు రైతు సంఘాల నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతు సమన్వయ సమితి  రాష్ట్ర  కార్యవర్గసభ్యులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, వేములపల్లి శ్రీనివాస రావు, గుండపనేని ఉమావరప్రసాద్‌,  బేత శ్రీనివాసరావు, సాయికళ్యాణి, సాంబశివరావు, పుట్టా సురేష్‌, అబ్దుల్‌ బారీ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:03:30+05:30 IST