రైతు వ్యతిరేక చట్టాలను మానుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T02:34:57+05:30 IST

కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే మానుకోవాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డి

రైతు వ్యతిరేక చట్టాలను మానుకోవాలి
ఉదయగిరిలో నిరసన తెలుపుతున్న రైతులు

ఉదయగిరి, డిసెంబరు 3: కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే మానుకోవాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా గురువారం స్ధానిక బస్టాండ్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు.  మోటార్లకు మీటర్లు బిగించే పద్దతి విరమించాలని డిమాండ్‌ చేశారు. రైతుల మెడకు ఉరితాళ్లు లాంటి చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలన్నారు.  కార్యక్రమంలో నాగూర్‌సాహెబ్‌, వెంకటేశ్వర్లు, అమీర్‌జాన్‌, తదితరులు పాల్గొన్నారు.

 అనంతసాగరంలో..


అనంతసాగరం, డిసెంబరు 3. ఢిల్లీలో రైతు సమస్యపై పోరాడుతున్న రైతులకు మద్దతుగా గురువారం అనంతసాగరంలో సీపీఎం  నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. రైతుల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు అన్వర్‌, వేముపెంచలయ్య, సుధాకర్‌, ఫకూర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T02:34:57+05:30 IST