రైతుల నిలువుదోపిడీ

ABN , First Publish Date - 2021-11-28T04:11:16+05:30 IST

అన్నదాతకు ఏమి అవరమో దా నిని ఆసరాగా తీసుకొని మందులషాపు యజమానులు, దళారులు, ప్రైవేటు వ్యాపారులు కలిసి నిలువునా దోచేస్తున్నారు.

రైతుల నిలువుదోపిడీ

పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం

గిట్టుబాటు ధర కంటే తక్కువకు కొనుగోలు

దళారుల ఇష్టారాజ్యం

ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

పొదిలి (రూరల్‌), నవంబరు 27: అన్నదాతకు ఏమి అవరమో దా నిని ఆసరాగా తీసుకొని మందులషాపు యజమానులు, దళారులు, ప్రైవేటు వ్యాపారులు కలిసి నిలువునా దోచేస్తున్నారు. చేతిలో చిల్లిగ వ్వ లేకపోవడంతో రైతులు అప్పలు చేస్తున్నారు. ఆ సమయంలో ద ళారులు, ప్రైవేటు వ్యాపారులు పెత్తనం సాగిస్తున్నారు. అదే అదును గా చేసుకొని రైతు పండించిన పంటను కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్‌ ధరకంటే 30 శాతం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దళారుల చేతిలో మోసపోతున్నాడు. ప్రభుత్వం రైతు ఇంటి ముందుకే అవసరానికి సరిపడా ఎరువులు, గింజలు ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేస్తామన్నా కూడా రైతులు దానికి ఇష్టపడకుండా ప్రయివేటు వ్యక్తు లను ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయ అవసరానికి అనుకూలంగా గతం లో కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా సరఫరా చేయలేదని, దీంతో ఖరీప్‌ చేజారిపోతుందంటున్నారు. దళారులను ఆశ్రయించాల్సి వస్తోం దని అన్నదాతలు అంటున్నారు. 

వ్యవసాయదారుల్లో మూడొంతుల మంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయ సీజన్‌లో అప్పుఇచ్చే వ్యాపారుల వద్ద నుంచి ఎరువులు, గింజలు తెచ్చుకుంటున్నారు. ప్ర భుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ముందుగా డబ్బులు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయింయచుకుంటేనే ఎరువులు ఇస్తారు. దీంతో రైతులు ఆవైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది ప్రభుత్వమే కనుక ప్రైవేటు వ్యాపారులు ఇచ్చే అప్పు వెసులుబాటును ప్రభుత్వం కల్పించి రైతులను ఆదుకోవా ల్సిన అవసరం ఉంది. కేంద్రాలను ఏర్పాటుచేసి పంటను కొనుగోలు చేసేది ప్రభుత్వమే కనుక అమ్మకం సమయంలో అప్పును మినహా యించాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాచేస్తే రైతులకు ఏంతో మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. 

చేతిలో నగదులేక ప్రైవేటు వ్యాపారుల వైపు రైతులు మొగ్గు చూపు తున్నారు. దీంతో పంట విక్రయించే సమయంలో వారి ఇష్టానుసా రంగా కొనుగోలు చేయడంతో రైతులు ధర రాక నష్టపోతున్నారు. అం తేకాకుండా అప్పులు ఇచ్చిన సాకుతో పంటను కొనుగోలు చేసిన తరు వాత సుమారు నాలుగు నెలల  నుంచి ఐదు నెలలకు కూడా వారి అప్పును మినహాయించుకొని మిగిలిన సొమ్ము మొత్తాన్ని  ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. ఆ విధంగా రైతుల ఆవసరాన్ని ఆసరా గా చేసుకొని కొంతమంది వ్యాపారులు ధర విషయంలో తగ్గించి పం టను కొనుగోలుచేసి లక్షల రూపాయలను అర్జిస్తున్నారు.  ఆరుగాలం రెక్కల కష్టంచేసిన రైతుకు వారు తెచ్చిన అప్పులు కూడా తీరడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇచ్చే అరువును ప్రభుత్వమే కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-11-28T04:11:16+05:30 IST