నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T06:12:43+05:30 IST

నివర్‌ తు ఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు నష్టపో యిన రైతులను వెంటనే ఆదుకోవాలని మా ర్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి
మాదిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల


మాజీ ఎమ్మెల్యే కందుల

పొదిలి రూరల్‌, డిసెంబరు 2 : నివర్‌ తు ఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు నష్టపో యిన రైతులను వెంటనే ఆదుకోవాలని మా ర్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని మాదిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అసలే అప్పుల్లో ఉన్న రైతులను తుఫాన్‌ కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈ- క్రాప్‌ నిబంధనను సడలించి పంట నమోదు చేసుకోని రైతులకు కూడా పరిహారం చె ల్లించాలని కోరారు. ఈవిషయంలో పార్టీలక తీతంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు చప్పిడి రామ లిం గయ్య, గునుపూడి భాస్కర్‌, రసూల్‌, యాసి న్‌, ఓబుల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, భాషా, భూ మా సుబ్బయ్య, కుద్దూస్‌, మల్లి తది తరులు ఉన్నారు.  

సిద్ధవరంలో  

కొనకనమిట్ల : మండలంలోని సిద్ధవరం గ్రామంలో దెబ్బతిన్న పంటలను మాజీ ఎ మ్మెల్యే నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బర్లు, మినుము, శనగ, కంది పంటలు సాగు చేసిన రైతులు తుఫాన్‌తో తీవ్రంగా నష్ట పోయారన్నారు. పెట్టుబడులు కూడా  వచ్చే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. వెంటనే వారిని ఆదుకోవాలని కోరారు. 

ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహారావు, మాజీ అధ్యక్షుడు వరికూటి వెంకటరామిరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చప్పిడి రామలింగయ్య, సిద్ధవరం మాజీ సర్పంచ్‌ కిలారి బొంతయ్య, రైతులు పాల్గొన్నారు. 




3

Updated Date - 2020-12-03T06:12:43+05:30 IST