భారీ పేలుడు పదార్థాలతో యూఎస్ నేవీ పరీక్షలు.. 3.9తీవ్రతతో కంపించిన భూమి

ABN , First Publish Date - 2021-06-21T19:14:06+05:30 IST

అమెరికా నేవీ శుక్రవారం కీలక ఘట్టానికి తెరలేపింది. యుద్ధవిమాన వాహక నౌకల పటిష్టతను తెలుసుకునేందుకు ‘ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్’పేరుతో కఠిన పరీక్షలను నిర్వహించింది. భారీ పేలుడు పదార్ధాలను నౌ

భారీ పేలుడు పదార్థాలతో యూఎస్ నేవీ పరీక్షలు.. 3.9తీవ్రతతో కంపించిన భూమి

మియామీ: అమెరికా నేవీ శుక్రవారం కీలక ఘట్టానికి తెరలేపింది. యుద్ధవిమాన వాహక నౌకల పటిష్టతను తెలుసుకునేందుకు ‘ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్’పేరుతో కఠిన పరీక్షలను నిర్వహించింది. భారీ పేలుడు పదార్ధాలను నౌకల సమీలంలో పేల్చిడం ద్వారా యుద్ధ సమయంలో వాటిని ఉపయోగించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించింది. ఇందులో భాగంగా ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ మహా సముద్రంలో యూఎస్‌కు నేవీకి చెందిన అత్యాధునిక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్ సమీపంలో 40వేల పౌండ్ల (18,144కిలోల) భారీ పేలుడు పదార్థాన్ని అధికారులు ఉపయోగించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను యూఎస్ నేవీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఈ క్రమంలో స్పందించిన యూఎస్ జియోలాజికల్ సర్వే సంచలన విషయాన్ని వెల్లడించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో సంభవించిన పేలుడు కారణంగా రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలిపింది.




Updated Date - 2021-06-21T19:14:06+05:30 IST