సాయ్‌ కోచ్‌ సస్పెండ్‌

ABN , First Publish Date - 2021-04-23T06:22:40+05:30 IST

శిక్షణ పేరిట 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 50 సంవత్సరాల కోచ్‌ను తీహార్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈనెల 10న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

సాయ్‌ కోచ్‌ సస్పెండ్‌

న్యూఢిల్లీ: శిక్షణ పేరిట 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 50 సంవత్సరాల కోచ్‌ను తీహార్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈనెల 10న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)కు చెందిన ఆ అథ్లెటిక్స్‌ కోచ్‌  10వ తేదీన బాధిత బాలికను ప్రత్యేక శిక్షణ కోసం సిరి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన బాలికపై లైంగిక దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. సదరు కోచ్‌ను సస్పెండ్‌ చేసిన సాయ్‌.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది.

Updated Date - 2021-04-23T06:22:40+05:30 IST