ముందుకు సాగని సబర్బన్‌ Train

ABN , First Publish Date - 2021-11-28T18:23:08+05:30 IST

బెంగళూరు నగర ట్రాఫిక్‌ ఎద్దడిని కొంతమేరకైనా నివారించే ఉద్దేశ్యంతో మంజూరైన సబర్బన్‌ రైలు పథకం గత 13 నెలలుగా ముందుకు సాగక చతికిలపడింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ 2019 బడ్జెట్‌లోనే ఈ పథకాన్ని

ముందుకు సాగని సబర్బన్‌ Train

                     - గ్రీన్‌ సిగ్నల్‌ దక్కి 13 నెలలు 


బెంగళూరు: బెంగళూరు నగర ట్రాఫిక్‌ ఎద్దడిని కొంతమేరకైనా నివారించే ఉద్దేశ్యంతో మంజూరైన సబర్బన్‌ రైలు పథకం గత 13 నెలలుగా ముందుకు సాగక చతికిలపడింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ 2019 బడ్జెట్‌లోనే ఈ పథకాన్ని ప్రకటించినప్పటికీ 20 20 అక్టోబరు 21న రైల్వే బోర్డు పచ్చజెండా చూపింది. ఆరేళ్లలోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను కర్ణాటక రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ (కే-రైడ్‌)కు అప్పగించారు. మొత్తం నాలుగు కారిడార్‌లుగా విభజించారు. సబర్బన్‌ రైలు విస్తీర్ణం మొత్తం 148.17 కిలోమీటర్లుగా ఉంది. మొత్తం 57 రైల్వే స్టేషన్లను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తారు. సబర్బన్‌ రైలు మార్గ సివిల్‌ పనుల టెండర్‌ ప్రక్రియ సాగుతోందని మరో మూడు నెలల్లో రైల్వే మార్గం నిర్మాణ పనులు ప్రా రంభమవుతాయని కే-రైడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌గర్గ్‌ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అనుమతులు లభించి ఏడాది గడిచినా పనుల జాప్యానికి గల కారణాలను ఆయన వివరిస్తూ భూ సేకరణతోపాటు అనేక సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకురావడం వల్లే ఆలస్యమవుతోందన్నారు. అయితే ఏడాదికాలంగా జాప్యం కొనసాగుతున్న తీరుపై నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ను భేటీ అయ్యానని, సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని కోరినట్టు బెంగళూరు ఉత్తర లోక్‌సభ సభ్యుడు డీవీ సదానందగౌడ వెల్లడించారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇప్పటికే చాలా రోజులు వృథా కావడం బాధగా ఉందన్నారు. ఇక మిగిలిన రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయని ఎన్నికల నియామవళి కూడా అడ్డు రావడంతోనే జాప్యం ఏర్పడిందని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, ఇప్పటికై నా తీవ్రంగా మారిన నగర ట్రాఫిక్‌ సమస్యకు తెరదించాలని ప్ర జలు కోరుతున్నారు. 

Updated Date - 2021-11-28T18:23:08+05:30 IST