వంటలు

సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- ఓ కప్పు, ఆలుగడ్డలు- నాలుగు, వేరుశనగ పప్పు- సగం కప్పు, పచ్చి మిర్చి- రెండు, అల్లం- చిన్న ముక్క, కొత్తిమీర తురుం- రెండు స్పూన్లు, చక్కెర- రెండు స్పూన్లు, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే నీటిని వడకట్టాలి. ఆలుగడ్డల్ని ఉడికించిపెట్టుకోవాలి. వేరుశనగ పప్పును వేయించి కచ్చపచ్చాగా రుబ్బుకోవాలి. ఓ గిన్నెలోకి సగ్గుబియ్యం, ఆలుగడ్డ, వేరుశెనగ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చక్కెర, ఉప్పు, తగినంత నీరు వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి చేతివేళ్లతో వడల్లాగా వత్తుకొని ఒక్కొక్కటి వేయిస్తే సగ్గుబియ్యం వడలు రెడీ.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.