BJPని ఓడించే సత్తా జాతీయ స్థాయిలో ఒక్క Congressకే ఉంది: Sachin Pilot

ABN , First Publish Date - 2022-05-11T22:26:20+05:30 IST

ఉదయ్‌పూర్: జాతీయ స్థాయిలో బీజేపీని, ఎన్డీయేను ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ యువ నేత సచిన్ పైలట్ తెలిపారు.

BJPని ఓడించే సత్తా జాతీయ స్థాయిలో ఒక్క Congressకే ఉంది: Sachin Pilot

ఉదయ్‌పూర్: జాతీయ స్థాయిలో BJPని, NDAను ఓడించగలిగేది Congress పార్టీయేనని ఆ పార్టీ యువ నేత Sachin Pilot తెలిపారు. మే 13 నుంచి 15 వరకూ ఉదయ్‌పూర్‌లో జరిగే Nav Chintan Shivirలో 400మందికి పైగా కాంగ్రెస్ నేతలు పాల్గొంటారని ఆయన చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంపై శిబిరంలో చర్చిస్తామన్నారు. సంకీర్ణ శకంలో ఎన్డీయేను ఎలా ఎదుర్కోవాలనే అంశంతో పాటు పార్టీని పునరుజ్జీవింప చేసేందుకు తీసుకోదగ్గ చర్యలపై చర్చిస్తామని తెలిపారు. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో, 2024లో పార్లమెంట్‌కు జరిగే ఎన్నికల్లో సత్తా చూపగలిగేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు.  



Updated Date - 2022-05-11T22:26:20+05:30 IST

Read more