ఆ ముగ్గురికి మాస్టర్‌ కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2020-07-06T08:50:37+05:30 IST

గురుపూర్ణిమ సందర్భంగా తన జీవితంలో అత్యంత కీలకంగా నిలిచిన ముగ్గురికి సచిన్‌ టెండూల్కర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్‌ బ్యాట్‌ను చేతిలో ...

ఆ ముగ్గురికి మాస్టర్‌ కృతజ్ఞతలు

ముంబై: గురుపూర్ణిమ సందర్భంగా తన జీవితంలో అత్యంత కీలకంగా నిలిచిన ముగ్గురికి సచిన్‌ టెండూల్కర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్‌ బ్యాట్‌ను చేతిలో పట్టుకుని ఓ వీడియో సందేశం ద్వారా అతడు తన గురువులను గుర్తుచేసుకున్నాడు. ‘నేనెప్పుడు బ్యాట్‌ పట్టుకున్నా ఈ ముగ్గురి గురించే ఆలోచిస్తుంటా. వారి కారణంగానే ఈ స్థాయిలో ఉన్నా. ముందుగా నా సోదరుడు అజిత్‌ టెండూల్కర్‌ గురించి చెప్పాలి. నా మార్గదర్శి అతను. ఇక నా కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ అయితే గంటల కొద్దీ నా బ్యాటింగ్‌ తీరును పరిశీలిస్తూ లోపాలను సరిచేసేశాడు. చివరిగా నా తండ్రి రమేష్‌ టెండూల్కర్‌ జీవితంలో అడ్డదారుల వెంట పయనించకు అని నాకు గుర్తుచేసేవాడు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.


Updated Date - 2020-07-06T08:50:37+05:30 IST