పిల్లలతో క్రికెట్ ఆడుతున్న శునకం.. సచిన్ పోస్టు చేసిన వీడియో వైరల్

Published: Mon, 22 Nov 2021 21:32:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పిల్లలతో క్రికెట్ ఆడుతున్న శునకం.. సచిన్ పోస్టు చేసిన వీడియో వైరల్

ముంబై: కుక్కలు మనిషికి విశ్వాసం గల నేస్తాలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పోస్టు చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ శునకం పిల్లలతో క్రికెట్ ఆడడం కనిపిస్తుంది. అంతేకాదు, ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆ శునకం డబుల్ రోల్ పోషిస్తుండడం. ఫీల్డింగ్, కీపింగ్ బాధ్యతలు చూసుకుంటూ పిల్లలకు ఎంతగానో సాయపడుతోంది. 


ఓ స్నేహితుడు తనకీ వీడియో పంపాడని పేర్కొన్న సచిన్.. అద్భుతంగా బంతిని అందుకునే వికెట్ కీపర్లు, ఫీల్డర్లు, ఆల్ రౌండర్లను మనం క్రికెట్‌లో చూశామని, కానీ దీనినేమంటారని క్యాప్షన్ తగిలించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే లగాన్ సినిమా గుర్తొస్తోందని కొందరంటే.. బాల్య స్మృతులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. మరికొందరు ఆ శునకాన్ని ‘లెజెండ్’ అని కీర్తించారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.