సచివాలయం వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు
కోట, జనవరి 21 : గ్రామ సచివాలయాలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. తిన్నెలపూడి, వెంకన్నపాళెం గ్రామ సచివాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఎంపీడీవో భవాని, మండల వైసీపీ కన్వీనర్ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మోబిన్‌బాషా, యువజన విభాగం అధ్యక్షుడు చిల్లకూరు సాయిప్రసాద్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.