సచివాలయానికి తాళం

ABN , First Publish Date - 2021-05-11T06:06:41+05:30 IST

గ్రామ సచివా లయానికి అద్దె చెల్లించకపోవడంతో సోమవారం ఇంటి యజమాని తాళం వేశారు. 2020 జనవరిలో మండ లంలోని తురకపాలెం గ్రామ సచివా లయాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు.

సచివాలయానికి తాళం

16 నెలలుగా అద్దె చెల్లించని వైనం

తాళ్లూరు, మే 10 : గ్రామ సచివా లయానికి అద్దె చెల్లించకపోవడంతో సోమవారం ఇంటి యజమాని తాళం వేశారు.  2020 జనవరిలో మండ లంలోని తురకపాలెం గ్రామ సచివా లయాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. నెలకు రూ. 4వేలు అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అద్దెభనంలో చేరి 16 నెల లు కాస్తున్నా ఇప్పటికి యజమానికి పైసా చెల్లించలేదు. ప్రస్తుతం ఇంటి యజమానికి గ్రామ సచివాలయ అధికారులు 64వేల రూపాయల చె ల్లించాల్సి ఉంది. ఇంటి యజమాని అనేకమార్లు గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామకార్యదర్శి  దృష్టికి తీసుక వెళ్లినా ఫలితంలేదు. దీంతో విసుగెత్తిన ఇంటి యజమాని సోమవారం ఉదయం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. అద్దె చెల్లించే వరకు తాళం తీసేదిలేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమిలేక సచివాలయ సిబ్బంది నాలుగు గంటల పాటు వెలుపలే ఉండిపోయారు.  ఈ సమా చారాన్ని గ్రామ వీఆర్వో పి.చంద్రశేఖర్‌ ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు తక్షణమే స్పందించి గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామకార్యదర్శులకు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో గ్రామానికి చెందిన పెద్దలతో మాట్లాడి సచివాలయంకు తాళం వేయటం తప్పని, అద్దె విషయంలో సమస్య వుంటే తమ దృష్టికి తీసుక వస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అద్దె చెల్లింపునకు చర్యలు చేపడతామని తెలపటంతో ఇంటియజమాని మధ్యాహ్నం సమయంలో తాళం తీశారు. దీంతో యథాప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-11T06:06:41+05:30 IST