పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-10-24T06:41:33+05:30 IST

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లాలోని తాడూరు ఏ.ఆర్‌. హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ అలెక్స్‌తో కలిసి ప్రారంభించారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల క్రైం, అక్టోబరు 23: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లాలోని తాడూరు  ఏ.ఆర్‌. హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ అలెక్స్‌తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌ల నుంచి అధికసంఖ్యలో పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. అనం తరం ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఫ్లాగ్‌డే సందర్భంగా రక్తదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. విధి నిర్వహ ణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసులను స్మరించుకోవడానికే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. అమరులైన పోలీసులను సమాజం ఎప్పటికీ మరువదన్నారు. పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల సందర్భంగా ఓపెన్‌హౌస్‌, షార్ట్‌ ఫిలిమ్స్‌, ఫొటోగ్రఫీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ న్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలను నిర్వహించి  బహుమ తులు అందజేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా  8 నుంచి 10వ తరగతి విద్యార్థులను వరకు ఒకగ్రూపుగా, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులను వేర్వే రుగా గ్రూపులుగా చేసి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.  ‘జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై 500 పదాలకు మించకుం డా వ్యాసం రాసి ఈనెల 24లోగా పంపాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు కుమారస్వామి, రజనీకాంత్‌, ఎస్‌బీ సీఐ సర్వర్‌, టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌, తంగళ్లపల్లి సీఐ లక్ష్మారెడ్డి, 17వ బెటాలియన్‌ యూనిట్‌ మెడికల్‌ అధికారి కరుణాకర్‌, ఆర్‌ఐలు డి. శంకర్‌, పి. రాజేందర్‌, బి.శ్రీధర్‌ పాల్గొన్నారు.

  సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ 

సిరిసిల్ల క్రైం : సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌హౌస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆర్‌ఐ (అడ్మిన్‌) కుమారస్వామి  మాట్లాడు తూ పోలీసుల త్యాగాలు స్పూర్తివంతంగా నిలుస్తాయన్నారు. ప్రజల కోసం ప్రాణాలను ఆర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు.   పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌వో, స్టేషన్‌ రైటర్‌, లాకప్‌, రిసె ప్షన్‌,వైర్లెస్‌ తదితర అంశాలపై టౌన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ విద్యార్థులకు వివరించారు. పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా తంగళ్లపల్లి మండ లంలోని తాడూరు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఐ, ఎస్సైలకు , ఏఆర్‌ఎస్సైలకు, కానిస్టే బుళ్లకు వేర్వేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  

Updated Date - 2021-10-24T06:41:33+05:30 IST