ముంపు గ్రామస్థుల త్యాగాల ఫలితంగానే సస్యశ్యామలం

ABN , First Publish Date - 2022-10-02T06:30:31+05:30 IST

ముంపు గ్రామస్థుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో జీవధారతో సస్యశ్యామలమైందని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

ముంపు గ్రామస్థుల త్యాగాల ఫలితంగానే సస్యశ్యామలం
భూనిర్వాసితులకు చెక్కులు పంపిణి చేస్తున ప్రజాప్రతినిధులు, అధికారులు

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు 

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 1: ముంపు గ్రామస్థుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో జీవధారతో  సస్యశ్యామలమైందని  నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మిడ్‌ మానేరు చీర్లవంచ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను కొండూరు రవీందర్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులందరికీ   నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు.  చీర్లవంచ భూనిర్వాసితులకు పరిహారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నష్టపరిహారం అందుకున్న భూనిర్వాసితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానసరాజు, సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ బండి దేవదాస్‌, చీర్లవంచ సర్పంచ్‌ జక్కల రవీందర్‌, ఎంపీటీసీ నల్వాల రేణుక, టీఆర్‌ఎస్‌ నాయకులు పూర్మాణి లింగారెడ్డి, మారం రాములు, కొండల్‌రావ్‌, గజభీంకర్‌ రాజన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T06:30:31+05:30 IST