ఎస్సీ వర్గీకరణ కోసమే సడక్‌ బంద్‌

ABN , First Publish Date - 2022-06-28T04:19:44+05:30 IST

ఎస్సీ రిజర్వేషన్‌లను ఏబీసీడీలుగా వర్గీకరించా లని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 2న సడక్‌ బంద్‌ చేపట్టామని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ సమ్మయ్య మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన మాదిగ సంగ్రామ యాత్ర సోమవారం మందమర్రికి చేరుకుంది. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎస్సీ వర్గీకరణ కోసమే సడక్‌ బంద్‌
మందమర్రిలో పాదయాత్ర చేస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

మందమర్రిటౌన్‌, జూన్‌ 27: ఎస్సీ రిజర్వేషన్‌లను ఏబీసీడీలుగా వర్గీకరించా లని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 2న సడక్‌ బంద్‌ చేపట్టామని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ సమ్మయ్య మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన మాదిగ సంగ్రామ యాత్ర సోమవారం మందమర్రికి చేరుకుంది. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ  రిజర్వేషన్‌ల కోసం ఉద్యమాలు చేస్తు న్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2న సడక్‌ బంద్‌ చేపట్టాలని, 3న చలో హైద్రాబాద్‌కు తరలిరావాలని పేర్కొన్నారు. నాయకులు వాసాల సంపత్‌, ఉపేందర్‌, పెద్దపల్లి సత్యనారాయణ, రాంశ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

కాసిపేట: మాదిగ సంగ్రామ యాత్ర సోమగూడెం చేరుకుంది.  యాత్రకు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు కల్వల శరత్‌ మాదిగ స్వాగతం పలికారు. జిల్లా కన్వీనర్‌ చెన్నూరి సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మోసం చేసిందన్నారు.  రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వర్గీకరణపై మోసం చేశారని తెలిపారు. నాయకులు లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, వంశీ, అరుణ్‌, సంజయ్‌, ఉదయ్‌, ప్రకాష్‌ , విష్ణు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T04:19:44+05:30 IST