Advertisement

పి. మాణిక్యాలరావు మృతిపై చిరంజీవి దిగ్బ్రాంతి

Aug 1 2020 @ 18:35PM

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా మహమ్మారి వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. కరోనా కారణంగా మాజీ మంత్రి పి. మాణిక్యాలరావు మరణించారనే వార్త విని మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.


‘‘కరోనా కారణంగా ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు మాజీ మంత్రి శ్రీ పి. మాణిక్యాలరావుగారు మరణించారనే వార్త తెలిసి చాలా బాధేసింది. ఆయన దయా హృదయం కలవారు. సామాన్యుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన క్షమశిక్షణతో ఎదుగుతూ.. కీలకమైన పదవులను అధిరోహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.