సంబరంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-04T06:14:56+05:30 IST

సంబరంగా సద్దుల బతుకమ్మ

సంబరంగా సద్దుల బతుకమ్మ
ఉర్సు రంగలీల మైదానంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 3: తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడింది.. పూల జాతర అంగరంగవైభవంగా సాగింది.. అందమైన బతుకమ్మ లను నెత్తిన ఎత్తుకుని ఆడపడుచులు ఆటస్థలాలకు బయలు దేరారు. బ తుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడుతూ, లయ బద్దంగా కోలా టం వేస్తూ సందడి చేశారు. సోమవారం సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలు, ఆనందోత్సవాలతో బతుకమ్మ  నిర్వహించుకున్నారు. ఉదయం ఇంటిల్లిపాది తలంటు స్నానాలు చేసి భక్తితో తీరొక్క పూజలతో శిబ్బి, తాంబాలంలో తంగేడు, గును గు, బంతి, చామంతి, గుమ్మడి, గులాబి, కట్ల, తామర వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో తయారుచేసిన గౌరమ్మను బతుకమ్మపైపెట్టి అగర్‌వొత్తులను వెలిగించి దేవతా మందిరంలో  ఏర్పాటు చేశారు. పిండి వంటలను త యారు చేసి అమ్మవారికి నివేదనచేశారు. సాయంత్రం భక్తిభావంతో బతుకమ్మలను చేతబూని చెరువు ప్రాంతా లకు వెళ్లి బతుకమ్మ ఆడారు. నిమజ్జనం చేశారు. పసుపు కుంకుమల వాయినాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. 

నగరంలో గుభాళించిన పూల జాతర..

నగరంలో సద్దుల బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు నుంచి బతుక మ్మలను పట్టుకొని చెరువు గట్లకు, మైదానాలకు , దేవాలయాలకు చేరారు. కాశిబుగ్గలోని శివాలయం, ఓసిటీ గ్రౌండ్‌, కోటిలింగాల దేవాలయం, పోతన ఆడిటోరియం, ఉర్సు రంగలీల మైదానం, భద్రకాళి దేవాలయంతోపాటు రామలింగేశ్వర, దుర్గేశ్వర, ఆకారపు వారి ఆలయం, శివనగర్‌లోని రామాలయం, ఖిలావరంగల్‌లోని శంభులింగేశ్వరాలయం, రంగశాయిపేట, శంభునిపేట, మామునూరు, ఉర్సు, కరీమాబాద్‌, బొమ్మలగుడి ఉర్సు చెరువు, లేబర్‌ కాలనీ కట్ట మల్లన్న చెరవుకు, దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువుకు, కొత్తవాడ మైదా నంలో ప్రాంతాల్లో  బతుకమ్మ ఆడి పాడారు.  

వేడుకల్లో ప్రముఖులు..

వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నా రు. పర్వతగిరిలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వరంగల్‌ ఉర్సు రంగలీల మైదానంలో కలెక్టర్‌ బి.గోపి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. నగర మేయర్‌ గుండు సుధారాణి దేశాయిపేట, కాశిబుగ్గ, రామన్నపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నల్లబెల్లి మండలంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడిషన్‌ కలెక్టర్‌ బి. హరిసింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి: సద్దుల బతుకమ్మ వేడుకల్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. సోమవారం మండలకేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలతో కలిసి బతుకమ్మను చేతపట్టి కొద్దిదూరం నడిచారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలంతా కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ మేరకు ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియ జేశారు. 


Updated Date - 2022-10-04T06:14:56+05:30 IST