సద్గురు జగ్గీ వాసుదేవ్ నోట.. గంగవ్వ మాట.. మట్టి ప్రాముఖ్యత తెలియజేస్తూ... ఆయన ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-06-25T01:09:15+05:30 IST

గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్ చానల్ ద్వారా తెలుగు వారికి చేరువై.. చివరకు బిగ్‌బాస్ షోలో పాల్గొని.. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితురాలు అయ్యింది. ఇప్పుడీ ప్రస్తావన...

సద్గురు జగ్గీ వాసుదేవ్ నోట.. గంగవ్వ మాట.. మట్టి ప్రాముఖ్యత తెలియజేస్తూ... ఆయన ఏమన్నారంటే..

గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్ చానల్ ద్వారా తెలుగు వారికి చేరువై.. చివరకు బిగ్‌బాస్ షోలో పాల్గొని.. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితురాలు అయ్యింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ‘సేవ్ సాయిల్’ పేరుతో మట్టి ప్రాముఖ్యతను తెలియజేస్తూ సద్గురు జగ్గీ వాసుదేవ్.. 100 రోజుల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. జూన్ 21న తమిళనాడు కోయంబత్తూరు పరిధి తిరునామం వద్దనున్న ఆదియోగి ప్రాంతంలో కావేరి నది ఒడ్డున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ గతంలో గంగవ్వను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు..


బిగ్‌బాస్ షోలో పాల్గొన్న గంగవ్వ.. ఒకే ఇంట్లో అన్ని రోజులు ఉండలేక, బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ‘మట్టి ముచ్చట..’ అంటూ ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా.. ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం గురించి, జగ్గీ వాసుదేవ్ గురించి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సద్గురు.. ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సమయంలో గంగవ్వను కలిశారు. ఈ సందర్భంగా సద్గురుతో "65 ఏళ్ల వయసున్న మీరు వర్షం, మంచు, ఇసుక తుఫానుల గుండా ప్రయాణిస్తున్నారంటే.. ఎవరో దేవుడు మీ వెనకే ఉన్నాడు, లేకపోతే  ఇదంతా జరగదు" అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది.


కావేరి నది ఒడ్డున జరిగిన ముగింపు కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్.. గంగవ్వ చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు. ‘‘గంగవ్వ చెప్పింది కరెక్టే.. నా వెనుక దేవుడు ఉన్నాడు.. అందుకే ఇదంతా నాకు సాధ్యమవుతోంది’’ అని తెలిపారు. ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం ముగింపు సందర్భంగా.. 74 దేశాలు, 8 భారతీయ రాష్ట్రాలు, 9 అంతర్జాతీయ ఏజెన్సీలు.. మట్టిని రక్షించు ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్లు సద్గురు చెప్పారు. త్వరలో మట్టిని రక్షించడం, పునరుత్పత్తి చేయడం తదితర అంశాలపై UK, US, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలతో సహా 20కి పైగా దేశాల్లో సద్గురు పర్యటించనున్నారు.





Updated Date - 2022-06-25T01:09:15+05:30 IST