పరిశ్రమల్లో భద్రత ముఖ్యం

ABN , First Publish Date - 2022-05-28T06:52:02+05:30 IST

పరిశ్రమల్లో భద్రత చాలా ముఖ్యమని, ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జాతీయ భద్రతా మండలి చైర్మన్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ సంచాలకులు డి.చంద్రశేఖర్‌ వర్మ అన్నారు.

పరిశ్రమల్లో భద్రత ముఖ్యం
సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌ వర్మ

రాష్ట్ర పరిశ్రమల శాఖ సంచాలకులు డి.చంద్రశేఖర్‌ వర్మ

ఉక్కుటౌన్‌షిప్‌, మే 27: పరిశ్రమల్లో భద్రత చాలా ముఖ్యమని, ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జాతీయ భద్రతా మండలి చైర్మన్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ సంచాలకులు డి.చంద్రశేఖర్‌ వర్మ అన్నారు. కర్మాగారాల శాఖ, జాతీయ భద్రతా మండలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చాప్టర్‌ ఆధ్వర్యంలో బిల్డింగ్‌ రిస్క్‌ బేస్డ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ కల్చర్‌ ఇన్‌ ప్రాసెస్‌ ఇండస్ట్రీ అనే అంశంపై శుక్రవారం స్టీల్‌ప్లాంట్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కెమికల్‌ ఫ్యాక్టరీలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ సీజీఎం(వర్క్స్‌) అభిజిత్‌ చక్రవర్తి మాట్లాడుతూ ప్రాసెస్‌ ఇండస్ట్రీస్‌లో కార్మికుల భాగస్వామ్యం కీలకమన్నారు. జాతీయ భద్రతా మండలి వైస్‌ చైర్మన్‌ ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జీవీఎస్‌ నారాయణ మాట్లాడుతూ ఇటువంటి వర్క్‌షాప్‌ వలన భద్రతపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో జిల్లాలోని వివిధ కెమికల్‌ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీల నుంచి 240 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్మాగారముల శాఖ ఇన్‌స్పెక్టర్‌లు పి.చిన్నారావు, కె.సుధాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T06:52:02+05:30 IST