రంగుల పండుగ జాగ్రత్తలివి!

ABN , First Publish Date - 2021-03-29T05:30:00+05:30 IST

హోలీ పండుగను జాలీగా జరుపుకోవడానికి సిద్ధమైపోయి ఉంటారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి...

రంగుల పండుగ జాగ్రత్తలివి!

హోలీ పండుగను జాలీగా జరుపుకోవడానికి సిద్ధమైపోయి ఉంటారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. 


  1. సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను మాత్రమే వాడండి. కృత్రిమ రంగులకు దూరంగా ఉండండి. న్యాచురల్‌ కలర్స్‌తో చర్మానికి హానికలగదు. తరువాత శుభ్రం చేసుకోవడం సులువు కూడా!
  2. హోలీ ఆడే ముందు గాగుల్స్‌ పెట్టుకోండి. దీనివల్ల కళ్లకు రక్షణ లభిస్తుంది. రంగులు కళ్లలో పడితే ప్రమాదమే. కాబట్టి గాగుల్స్‌ తప్పనిసరి పెట్టుకోండి.
  3. ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్‌, ప్యాంట్‌ వేసుకోండి. దీనివల్ల కాళ్లు, చేతులపై రంగులు పడకుండా చూసుకోవచ్చు. 
  4. పెట్రోలియం జెల్లీ, మాయిశ్చరైజర్లు పూసుకోవడం మరువద్దు. తలకు కొబ్బరి నూనె పెట్టుకోండి. దీనివల్ల రంగుల ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
  5. రంగులు నోట్లోకి పోకుండా చూసుకోవాలి. నోట్లో రంగులు పడితే వెంటనే మంచినీటితో రెండు, మూడుసార్లు పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి.
  6. కళ్లలో రంగు పడినట్లయితే రుద్దడం చేయకూడదు. నీళ్లతో బాగా కడగాలి. ఒకవేళ కన్ను బాగా ఎర్రబడితే డాక్టర్‌ను సంప్రదించాలి. 
  7. ఆస్తమా, బ్రాంకైటిస్‌, స్కిన్‌ అలర్జీ వంటివి ఉన్నట్లయితే రంగులకు దూరంగా ఉండటమే మంచిది.  

Updated Date - 2021-03-29T05:30:00+05:30 IST