హైదరాబాద్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన వ్యక్తిగత పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాగర్ సిమెంట్స్‌లో 10.10 శాతం వాటా కొనుగోలుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ రూ.350 కోట్లు. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన పీఐ ఆపర్చూనిటీస్ ఫండ్ (పీఐఓఎ్ఫ)కు రూ.2 ముఖవిలువ కలిగిన 1,32,07,548 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటీ రూ.265 చొప్పున కేటాయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. షేర్ల కేటాయింపు తర్వాత సాగర్ సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 50.28ు నుంచి 45.20 శాతానికి తగ్గనుంది.