సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2021-10-27T04:25:50+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 590.00 అడుగులు ఉంది. ఇది 312.04 టీఎంసీలకు సమానం.

సాగర్‌ నీటి సమాచారం
క్రస్ట్‌గేట్‌ ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత, అక్టోబరు 26: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 590.00 అడుగులు ఉంది. ఇది 312.04 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 8,529 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 9,076, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 32,764, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800, వరద కాలువ ద్వారా 400, ఒక క్రస్ట్‌గేట్‌ను ఐదు అడుగుల మేర ఎత్తి 8,100, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 60,669 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇనఫ్లో వాటర్‌గా 60,669 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 878.10 అడుగులుంది. ఇది 178.74 టీఎంసీలకు సమానం.   

బ్యారేజి దిగువకు 18,500 క్యూసెక్కులు

తాడేపల్లి టౌన్‌: ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు ఎగువున్న వాగుల నుంచి మంగళవారం సాయంత్రానికి 36,000 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 17,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నన్నారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 25 గేట్లను అడుగు వంతున ఎత్తి 18,500 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2021-10-27T04:25:50+05:30 IST