ముంబై : SIA టాటా సన్స్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ... ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. టాటా సన్స్ సింగపూర్ ఎయిర్‌లైన్స్(SIA), విస్తారాలో దాని జాయింట్ వెంచర్ భాగస్వామి, ఎయిర్ ఇండియాతో ఎయిర్‌లైన్‌ను విలీనం కోసం అన్వేషణాత్మక చర్చలు జరిపినట్లు సంబంధత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది చివరినాటికి ఎయిరిండియాలో సహారా విలీనంపై నిర్ణయం వెలువడవచ్చునని వినవస్తోంది. కాగా... సంబంధిత వర్గాలు మాట్లాడుతూ... ఎయిరిండియాలో విస్తారా మెర్జింగ్ విషయమై చర్చలు దాదాపుగా ఇప్పటికే పూర్తైనట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా... ఈ డీల్ కు సంబంధించిన ‘విలువ’ మాత్రం వెల్లడి కాలేదు.
ఇవి కూడా చదవండి