‘ప్రాణం ఖరీదు’ విడుదల రోజునే ‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదల

Sep 21 2021 @ 11:57AM

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో దేవాకట్టా బిజీ గా ఉన్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను రేపు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేకర్స్ .. చిరు నటించిన కొన్ని సినిమాల క్లిప్స్ తో ఓ మాంటేజ్ వీడియోను ట్విట్టర్ లో  విడుదల చేశారు. అందులో సాయిధరమ్ తేజ తనకు చరణ్ లాంటివాడని, అతడిలో తనను తాను చూసుకుంటున్నానని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పిన .. మాటల్ని హైలైట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మెగాభిమానుల్ని మెప్పిస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ విడుదలకు  సెప్టెంబర్ 22న లాంఛింగ్ తేదీ నిర్ణయించారు. సరిగ్గా ఇదే డేట్ లో చిరు.. 1978 లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ .. సరిగ్గా మేనమామ విడుదల తేదీ రోజున .. మేనల్లుడు సాయిధరమ్ తేజ రిపబ్లిక్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు, అలాగే ఆయన సినిమాలకు సంబంధించిన మాంటేజ్ వీడియోను విడుదల చేసినట్టు అర్ధమవుతోంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.