బాలీవుడ్లో బయోపిక్‌లకు ఎటువంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్ బాలీవుడ్ సెట్స్‌పై రన్ అవుతూనే ఉంటుంది. వారు బయోపిక్ తీయడానికి కాస్త రీజన్ ఉంటే చాలు.. బయోపిక్‌కి లైన్ క్లియర్ అయినట్లే. ఇప్పుడ వారి కన్ను హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్స్‌పై పడింది. సైనా, సింధు, మిథాలీ రాజ్ వంటి వారి బయోపిక్‌లను రూపొందించేందకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్లాన్ చేయడమే కాదు.. ఇందులో సైనా బయోపిక్ దాదాపు కంప్లీట్ కూడా అయిపోయింది. మార్చి 26న విడుదల అంటూ అధికారికంగా ఓ ప్రీ లుక్ కూడా వదిలారు.
'సైనా' పేరుతో తెరకెక్కిన ఈ బయోపిక్‌లో పరిణీతి చోప్రా టైటిల్ రోల్‌ని పోషించింది. వాస్తవానికి ఈ పాత్రకి ముందు శ్రద్ధా కపూర్‌ని అనుకున్నారు. ఆమెతో కొంత పార్ట్ షూట్ కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకోవడం, ఆ తర్వాత పరిణీతి వచ్చి చేరడం జరిగింది. పరిణీతి చోప్రాతో ఇప్పుడు టోటల్ సినిమా కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఇక తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. షటిల్ కాక్ రూపంలో టైటిల్‌ని చక్కగా డిజైన్ చేశారు. ఆ కాక్ని అందుకునే చేతిని చూపిస్తూ.. ఆ చేతికి భారత త్రివర్ణ పతాకపు బ్యాండ్‌ని చూపించారు. సర్వీస్‌కి రెడీ అయినట్లు సింబాలిక్‌గా రెడీ చేసిన ఈ టైటిల్ లోగో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయడమే కాకుండా.. ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ బయోపిక్‌ని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, సుజయ్ జైరాజ్, రాశేష్ షా నిర్మించారు.