Advertisement

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌ను 'ఫిదా' చేయనున్న బ్యూటీ

Oct 28 2020 @ 19:14PM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌'కు ఇది రీమేక్‌. 'వకీల్‌సాబ్‌' తర్వాత పవన్‌ ఈ సినిమాను స్టార్ట్‌ చేయనున్నారట. ఈ సినిమాకు 'బిల్లా రంగా' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్‌. కాగా లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ జోడీగా సాయిపల్లవి నటిస్తుందని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే వరణ్‌తేజ్‌తో జోడీ కట్టి తెలుగు ప్రేక్షకులను 'ఫిదా' చేసిన సాయిపల్లవి మరి బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌తో జతకడుతుందని వస్తున్న వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.