పాత జీతాలు వేయడం ఎలా సాధ్యం?: సజ్జల

ABN , First Publish Date - 2022-02-01T21:33:16+05:30 IST

పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు వేయడం ఎలా

పాత జీతాలు వేయడం ఎలా సాధ్యం?: సజ్జల

అమరావతి: పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు వేయడం ఎలా సాధ్యమని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగసంఘాల ప్రతిపాదనలను అంశాలవారీగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు వేయడం ఎలా సాధ్యమన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరామని ఆయన తెలిపారు. చర్చల సమయంలో ఉద్యమం అంటే ప్రతిష్టంభన ఏర్పడుతుందన్నారు. చలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతుందని వారు చెప్పారన్నారు. ఉద్యోగుల కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోదన్నారు. కరోనా నిబంధనలను ఉద్యోగసంఘాలు గుర్తుంచుకోవాలన్నారు. చలో విజయవాడ కార్యక్రమం కంటే ముందే సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. జీతాల్లో ఎక్కడా రికవరీ లేదన్నారు. ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్‌మెంట్ మాత్రమేనని ఆయన తెలిపారు. అది రీ అడ్జెస్ట్‌ అవుతుందని, దాన్ని రికవరీగా చూడొద్దన్నారు. ఉద్యోగసంఘాల నేతలను మంత్రులు బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణనలోకి తీసుకుని తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 



Updated Date - 2022-02-01T21:33:16+05:30 IST