నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డిపోల్లో Sajjanar ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2021-11-06T17:32:43+05:30 IST

నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డిపోల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలు అనంతరం అధికారులతో సజ్జనార్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ..ఆర్టీసీ కార్గో సేవలు

నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డిపోల్లో Sajjanar ఆకస్మిక తనిఖీలు

నల్లగొండ: నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డిపోల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలు అనంతరం అధికారులతో సజ్జనార్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ..ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందన్నారు. ఆర్టీసీ బస్సుతోనే సురక్షితమైన ప్రయాణం సాధ్యమన్నారు. మారుమూల ప్రాంతాలకూ ఆర్టీసీ బస్సు వెళ్తుందని, ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఫోన్ చేస్తే వారి వద్దకే వెళ్లి బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో, ఆర్టీసీ ఆస్తులపై అనుమతి లేకుండా సినిమా పోస్టర్లు ఉంచితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్ కేసులు కూడా నమో చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు.

Updated Date - 2021-11-06T17:32:43+05:30 IST