నమోస్తు శాంకరీ.. శాకంబరీ!

ABN , First Publish Date - 2021-07-24T07:31:51+05:30 IST

నగరంలోని రాజరాజేశ్వరి, వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవార్లు శాకంబరీ అలంక రణలో భక్తులకు కనువిందు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిపించి, పాడిపంటలు వృద్ధి చేసి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లీ అనే సంకల్పంతో అమ్మవార్లకు శుక్రవారం శాకంబరీ అలంకరణ చేశారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఈ అలంకరణ చేయడం ఆనవాయితీ.

నమోస్తు శాంకరీ.. శాకంబరీ!
కన్యకాపరమేశ్వరి ఆలయంలో శాకంబరి అలంకరణ (ఇన్‌సర్ట్‌) శాకంబరీ దేవికి హారతి

కూరగాయలు, పండ్లతో అమ్మవార్ల కనువిందు

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 23 : నగరంలోని రాజరాజేశ్వరి, వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవార్లు శాకంబరీ అలంక రణలో భక్తులకు కనువిందు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిపించి, పాడిపంటలు వృద్ధి చేసి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లీ అనే సంకల్పంతో  అమ్మవార్లకు శుక్రవారం శాకంబరీ అలంకరణ చేశారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఈ అలంకరణ చేయడం ఆనవాయితీ. స్టోన్‌హౌస్‌పేట కన్యకాపరమేశ్వరి ఆలయంలో కరోనా నివారణ, లోకకల్యాణార్థం శాకంబరీ అలంకరణ కనుల పండువగా జరిగింది. నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌, అర్బన్‌ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొని పూజలు చేశారు. ఉభయకర్తలుగా పాదర్తి బాలాజీ, రూపాదేవి, పైడా హేమంత్‌ కుమార్‌, రేణుక, పబ్బిశెట్టి నందకిషోర్‌, పద్మావతి, పసుమర్తి ప్రసాద్‌ వ్యవహరించారు. ఆలయ పాలక మండలి పర్యవేక్షించింది. 


రాజరాజేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకరణకు ఉభయకర్తలుగా కొలపర్తి రమేష్‌, సువర్ణలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి ఉదయం అభిషేకం, విశేషపూజలు జరిగాయి. రూరల్‌ ఎమ్మెల్యే సతీమణి సుజితమ్మ, పెద్ద సంఖ్యలో భక్తులు  తరలివచ్చారు. సాయంత్రం విశేష పూజలు, కుంభహారతులు జరిగాయి. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ రత్నం జయరామ్‌, ఈవో సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. 


Updated Date - 2021-07-24T07:31:51+05:30 IST