సఖీ వన్‌ స్టాప్‌ సెంటర్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-11-27T06:06:50+05:30 IST

సఖీ కేసులు త్వరగా పూర్తిచేసి వారికి నిర్ణీత సమయంలో న్యాయం జరిగే విధంగా పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సఖీ వన్‌ స్టాప్‌ సెంటర్‌ కేసులు త్వరగా పరిష్కరించాలి

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 26:  సఖీ కేసులు త్వరగా పూర్తిచేసి వారికి నిర్ణీత సమయంలో న్యాయం జరిగే విధంగా పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో జిల్లాస్థాయి సఖీ వన్‌ స్టాఫ్‌ సెంటర్‌ కమిటీ సమావేశం  కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌, మహిళా హెల్ప్‌లైన్‌ 181, గృహహింస, వరకట్నం, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణాపై  చోటుచేసుకున్న కేసులు డిసెంబరు ఒకటి, 2017 నుంచి అక్టోబరు 2020 వరకు జిల్లాలో 1134  కేసులు వచ్చాయన్నారు. డొమెస్టిక్‌ వాయిలెన్స్‌ కేసులు 733, రేప్‌ కేసులు 16, సెక్యువల్‌ అటెస్ట్‌ 5 తదితర కేసులు వచ్చాయన్నారు. బాఽధితులకు పోలీస్‌ శాఖ నుంచి వచ్చిన నివేదికలకు అనుగుణంగా వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T06:06:50+05:30 IST