ఫ్యాన్స్‌కు సాక్షి అగర్వాల్‌ వినతి

Jun 16 2021 @ 12:56PM

కోలీవుడ్‌ యంగ్ హీరోయిన్‌ సాక్షి అగర్వాల్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కాలా'తో పాటు అజిత్‌ 'విశ్వాసం' చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే, 'బిగ్‌బాస్‌' రియాల్టీ షోలో పాల్గొని అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె పలు చిత్రాల్లో నటించారు. వీటిలో ఒకటి 'సిండ్రెల్లా', 'పురవి', 'అరణ్మనై-3' వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమాలు విడుదలకానున్నాయి. అదేసమయంలో సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో తన భావాలను షేర్‌ చేసుకునే అలవాటు సాక్షికి ఉంది. ఆ కోవలో తాజాగా ఆమె తన అభిమానులకు తాజాగా ఓ సలహా ఇచ్చారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన సాక్షి... ప్రత్యేక ఫొటో షూట్‌లతో రెచ్చిపోయారు. అలాగే బరువు పెరగకుండా స్లిమ్‌గా ఉండేందుకు వీలుగా ఇంటిదగ్గరే వివిధ రకాల వ్యాయామాలు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలను ఆమె తన ఫ్యాన్స్‌కు షేర్‌ చేశారు. ఇంట్లో ఉండే పూలకుండీ, తలదిండు, దుస్తులు భద్రపరిచే పెట్టే వంటివాటితో సులభతరంగా వ్యాయామం చేస్తున్నారు. వీటిని వీడియో తీసిన సాక్షి... తన అభిమానులు కూడా ప్రతి రోజూ ఉదయం వేళల్లో ఈ చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.