Salaar: విడుదల తేదీ ఫిక్స్‌!

Published: Mon, 15 Aug 2022 13:55:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Salaar: విడుదల తేదీ ఫిక్స్‌!

డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas)అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’ (Salaar)విడుదల తేదీని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న సినిమాను విడుదల చేయనున్నట్ల తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తేదీని ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంతో సంబరాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ‘సలార్‌ ఆగమనం’ అనే ట్యాగ్‌ను నెట్టింట్‌ ట్రెండింగ్‌లో ఉంది. అన్న వస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Salaar on 28 september 2023)

‘రాధేశ్యామ్‌’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రమిది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు(Prasanth neel). యాక్ష్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతీహాసన్‌ కథానాయిక. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International