సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2020-11-11T10:17:58+05:30 IST

రాష్ట్రంలో రెడ్డి, పోలీసు రాజ్యం నడుస్తోందని, నంద్యాలలో సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఈ ఘటనపై

సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

విద్యాధరపురం, నవంబరు 10 : రాష్ట్రంలో రెడ్డి, పోలీసు రాజ్యం నడుస్తోందని, నంద్యాలలో సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్‌ టీడీపీ ఆధ్వర్యంలో అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారు. 


నేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనమన్నారు. దీనికి బాధ్యులైన సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై మాత్రం కంటితుడుపు చర్యలు తీసుకున్నారన్నారు. పోలీసు అధికారులు వారిపై బెయిల్‌బుల్‌ కేసులు మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందన్నారు. పార్టీ నేతలు రఫీ, నవనీతం సాంబశివరావు, ఫతావుల్లా, షేక్‌ జాన్‌ వలి, అఫ్రోజ్‌, కొగంటి రామారావు, ఎరుమళ్ల రమణారావు, లింగమనేని నాని, ఎం.పావని, హెచ్‌.మధుబాబు తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ జిల్లా కార్యాలయంలో..

సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్‌ అన్నారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద ప్లకార్డులతో జరిగిన నిరసన ప్రదర్శనలో రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఫిరోజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలాం కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం ప్రతి వ్యక్తి ఖండించారని, కానీ ఫ్యాక్షన్‌ మనస్తత్వం కలిగిన జగన్‌ మనసు కదిలించలేకపోయిందన్నారు. తూతూ మంత్రంగా పోలీసులపై కేసులు పెట్టి వెంటనే బెయిల్‌ వచ్చేలా సెక్షన్‌లు పెట్టడం వెనుక వైసీపీ నేతల ప్రోద్భలం ఉందన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సింహాద్రి కనకాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందన్నారు. పార్టీ నేతలు వీరంకి వెంకటగురుమూర్తి, సాదరబోయిన ఏడుకొండలు, కొత్త నాగేంద్రకుమార్‌, ఎండీ నజీర్‌, ఎండీ వైజాగ్‌, ఎండీ సల్మాన్‌, ఎల్‌.అరుణ్‌, కె.లీలాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-11T10:17:58+05:30 IST