భారత్‌కు బాసటగా అమెరికా టెక్ కంపెనీ!

ABN , First Publish Date - 2021-05-09T23:11:28+05:30 IST

కరోనా మహమ్మారి భారత్‌లో విలయం సృష్టిస్తోంది. దీంతో కొవిడ్-19తో ఇండియా చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. వీటితోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌కు బాసటగా నిలు

భారత్‌కు బాసటగా అమెరికా టెక్ కంపెనీ!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌లో విలయం సృష్టిస్తోంది. దీంతో కొవిడ్-19తో ఇండియా చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. వీటితోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ ఇండియాకు వైద్య పరికరాలను పంపింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లతో కూడిన బోయింగ్ 787 విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని సేల్స్‌ఫోర్స్ సంస్థ సీఈఓ మార్క్ బెనియోఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆరోగ్య శాఖ, రెడ్ క్రాస్ ద్వారా ఈ పరికరాలను భారత్‌లోని పలు ప్రాంతాలకు తరలించనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా అతి త్వరలోనే వైద్య పరికరాలతో కూడిన మరో విమానాన్ని ఇండియాకు పంపనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో వివరాళాలు అందించిన విషయం తెలిసిందే.  


Updated Date - 2021-05-09T23:11:28+05:30 IST