Infosys సీఈవోగా మరో 5 ఏళ్లపాటు సలీల్ పరేఖ్.. పునర్‌నియామకం..

ABN , First Publish Date - 2022-05-23T01:54:36+05:30 IST

దేశీయంగా రెండవ అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లిమిటెడ్(సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా సలీల్ పరేఖ్ పునర్నియమితులయ్యారు.

Infosys సీఈవోగా మరో 5 ఏళ్లపాటు సలీల్ పరేఖ్.. పునర్‌నియామకం..

బెంగళూరు : దేశీయంగా రెండవ అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ అయిన ఇన్ఫోసిస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా సలీల్ పరేఖ్ పునర్‌నియమితులయ్యారు. మరో ఐదేళ్లపాటు అంటే మార్చి 2027 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రకటించింది. మే 21, 2022న జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఎన్‌ఆర్‌సీ(నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ) సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్టాక్‌ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ లిమిటెడ్ వెల్లడించింది. కాగా సలీల్ పరేఖ్ జనవరి 2018 నుంచి ఇన్ఫోసిస్సీ ఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన పునర్‌నియామకానికి సంబంధించి కంపెనీ షేర్ హోల్డర్ల ఆమోదం దక్కాల్సి ఉంది.

Updated Date - 2022-05-23T01:54:36+05:30 IST