మరో ఐదేళ్లూ సలీల్‌ పరేఖ్‌కే ఇన్ఫీ పగ్గాలు

Published: Mon, 23 May 2022 03:17:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరో ఐదేళ్లూ సలీల్‌ పరేఖ్‌కే ఇన్ఫీ పగ్గాలు

న్యూఢిల్లీ: సలీల్‌ పరేఖ్‌ను మరో ఐదేళ్ల పాటు కంపెనీ సీఈఓ, ఎండీగా తిరిగి నియమించాలని ఇన్ఫోసిస్‌ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 21న జరిగిన సమావేశంలో ఆమో దం తెలిపింది. దీని ప్రకారం పరేఖ్‌.. 2027 మార్చి 31 వరకు ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీగా కొనసాగుతారు. నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ఫోసిస్‌.. రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. వాటాదారుల ఆమోదంతో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.