ఉప్పు మితంగా....

ABN , First Publish Date - 2020-11-01T17:35:02+05:30 IST

ఆహారంలో ఉప్పు తగు మోతాదులో ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సగటున రోజుకు (8 గ్రాములు) సగం స్పూన్‌ ఉప్పు తినడం ఆరోగ్యదాయకం. అదే మోతాదుకు మించితే శరీరానికి ఎక్కువ హాని చేస్తుంది. కొన్ని అలవాట్లు

ఉప్పు మితంగా....

ఆంధ్రజ్యోతి(01-11-2020)

ఆహారంలో ఉప్పు తగు మోతాదులో ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సగటున రోజుకు (8 గ్రాములు) సగం స్పూన్‌ ఉప్పు తినడం ఆరోగ్యదాయకం. అదే మోతాదుకు మించితే శరీరానికి ఎక్కువ హాని చేస్తుంది. కొన్ని అలవాట్లు మానుకుంటే ఆహారంలో ఉప్పు తగ్గించడం అంత కష్టమేమి కాదు అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ రీతూ ఖనేజా. అవేమిటంటే...


తొందరగా ఆకలి తీరుతుందని చాలామంది ప్రాసెస్డ్‌ ఫుడ్‌, సాస్‌ తింటారు. వీటిలో రుచి కోసం ఎక్కువ ఉప్పు కలుపుతారు. కాబట్టి వీటి బదులు పండ్లు, నట్స్‌, గింజలు తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

ఆహారంలో ఉప్పు తక్కువయిందని కొందరు ఉప్పు చల్లుకొని తింటారు. అయితే వండే సమయంలో ఉప్పులోని ఐరన్‌ రూపం మారుతుంది. దాంతో అది తేలిగ్గా జీర్ణమవుతుంది. అలాకాకుండా ఆహారంలో ఉప్పు చల్లుకొని తినడం వల్ల అది ఆలస్యంగా అరుగుతుంది. అంతేకాదు రక్తపీడనం పెరగడం నీటిని గ్రహించడం, గుండె జబ్బుల ముప్పు ఎక్కువవడానికి కారణం అవుతుంది. 

ఉప్పు తక్కువయినప్పుడు పచ్చళ్లు లేదా అప్పడాలతో ఆహారం తినాలి. దీంతో అదనంగా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఘాటుగా ఉండే పచ్చళ్లలో సోడియం, ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ కారంగా ఉన్న పచ్చళ్లు ఎంచుకోవాలి.

ఏం తింటున్నారు. అది ఆరోగ్యానికి మంచిదా కాదా! అనే విషయం గమనించాలి. కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే సోడియం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్‌లను మితంగా తినాలి.

Updated Date - 2020-11-01T17:35:02+05:30 IST