విధి నిర్వహణకు మారుపేరు అంగన్‌వాడీ కార్యకర్త రెలూ వాస్వే

ABN , First Publish Date - 2020-11-23T16:57:20+05:30 IST

మహారాష్ట్రలోని నందుర్బార్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త రెలూ వాస్వే విధి నిర్వహణలో...

విధి నిర్వహణకు మారుపేరు అంగన్‌వాడీ కార్యకర్త రెలూ వాస్వే

ముంబై: మహారాష్ట్రలోని నందుర్బార్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త రెలూ వాస్వే విధి నిర్వహణలో చూపే అంకితభావానికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఆరేళ్లుగా రెలూ వాస్వే గ్రామాల్లోని శిశువులు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణ కోసం 10 కిలోమీటర్ల దూరం వరకూ స్వయంగా పడవ నడుపుతూ. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ప్రతీరోజూ ఇంత దూరం వెళ్లడం కష్టమే... కానీ పిల్లలకు, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడమనేది ఎంతో గొప్పపని. వారి ఆరోగ్యానికి అది ఎంతో ముఖ్యమని తెలిపింది.


27 ఏళ్ల రెలూ వాస్వే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె విధి నిర్వహణ కోసం ప్రతీరోజూ 18 కిలోమీటర్ల దూరం పడవలో ప్రయాణిస్తుంది. గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతోనే ఆమె పడవలో వెళుతుంటుంది. కరోనా కారణంగా ఆదివాసీ గ్రామాల వారెవరూ బయటకు రావడంలేదు. దీంతో రెలూ వారికి కూడా ఆహారాన్ని అందిస్తోంది.

Updated Date - 2020-11-23T16:57:20+05:30 IST