ప్రతిభావంతులకు సత్కారం

ABN , First Publish Date - 2022-09-27T05:19:43+05:30 IST

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ రాములు నాయక్‌ ప్రశంసాపత్రాలు, క్యాష్‌ రివార్డులు అందించి అభినందించారు.

ప్రతిభావంతులకు సత్కారం
ప్రశంసాపత్రం అందిస్తున్న అదనపు ఎస్పీ రాములు నాయక్‌

- ప్రశంసాపత్రాలు, క్యాష్‌ రివార్డులు అందించిన అదనపు ఎస్పీ

గద్వాల క్రైం, సెప్టెంబరు 26 : విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ రాములు నాయక్‌ ప్రశంసాపత్రాలు, క్యాష్‌ రివార్డులు అందించి అభినందించారు. బాధ్యతతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తిపు ఉంటుందని, వారు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు రివార్డులు ప్రోత్సాహాన్ని అందిస్తామని అదనపు ఎస్పీ అన్నారు. వివిధ విభాగాలలో ప్రతిభ కనపర్చిన గట్టు ఎస్‌ఐ పవన్‌కుమార్‌, గద్వాల ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి, అలంపూర్‌ ఎస్‌ఐ శ్రీహరి, రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహ గుప్తా, అయిజ హెడ్‌కానిస్టేబుల్‌ జయన్న, సిబ్బంది యుగందర్‌, మాబాష, రమేష్‌బాబు, ఆకాష్‌, తిమ్మన్న, రాందాస్‌లకు ప్రశంసాపత్రాలు అందించారు. రిసెప్షన్‌ అధికారులు శ్రావణి, నాగలక్ష్మి, కావేరి, విజయకుమారి, కరుణాకర్‌, జ్యోతి, చాముండేశ్వరి, నీలమ్మ, జ్యోతి, మానస, మంజుల, శైలజ, వీణదేవిలకు క్యాష్‌ రివార్డులను అందించారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో సతీష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


సమస్యల పరిష్కారానికి కృషి

శాంతిభధ్రలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోలీస్‌ శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని, సివిల్‌ వివాదాలను కోర్టులో పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ రాములు నాయక్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుదారులతో అదనపు ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని సీఐ, ఎస్‌ఐలకు సూచించారు.


Updated Date - 2022-09-27T05:19:43+05:30 IST