ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం?

ABN , First Publish Date - 2021-07-22T03:56:29+05:30 IST

లేఅవుట్‌ క్రమబద్ధీకర ణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం పెట్టుకున్న దరఖాస్తులకు మో క్షం లభించనుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం?
ఎదిరలో ఏర్పాటు చేస్తున్న ఓ వెంచర్‌

- క్షేత్రస్థాయిలో తనిఖీలకు ప్రత్యేక కమిటీలు

- పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో 43 వేల దరఖాస్తులు


మహబూబ్‌నగర్‌, జూలై 21 : లేఅవుట్‌ క్రమబద్ధీకర ణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం పెట్టుకున్న దరఖాస్తులకు మో క్షం లభించనుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న భూములు, ప్లాట్లను క్షేత్రస్థాయిలో కమిటీలు తనిఖీలు చేయనున్నాయి. క్షేత్రస్థాయి తనిఖీలకు ప్రభుత్వం 15 రోజుల గడువు విధించగా, కమిటీలు వాస్తవ పరిస్థితు లను పరిశీలించి కలెక్టర్‌, కమిషనర్‌లకు నివేదికలు అందించనున్నాయి. ఆ తరువాత ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనున్నది.

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఒక్క పాలమూరు మునిసిపాలి టీలోనే దాదాపు 30 వేలకు పైగా దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. జడ్చర్లలో ఎనిమిది వేలు, భూత్పూ ర్‌లో ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖా స్తులను పరిశీలించాలంటే కమిటీలకు దాదాపు నెల స మయం పట్టే అవకాశం ఉన్నది. ప్రభుత్వం 15 రోజు ల్లో వీటిని పూర్తి చేయాలని చెప్పగా, ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయింది. ఇంకా కలెక్టర్‌ కమిటీలను ని యమించాల్సి ఉంది. కమిటీలో సభ్యులెవరెవరు ఉంటా రు? ఎన్ని కమిటీలను నియమిస్తారు? క్షేత్రస్థాయిలో ఈ కమిటీలు ఏమేమి పరిశీలించాలో చెక్‌ లిస్ట్‌ విడుద ల చేయాల్సి ఉంది. ఆయా ప్రాంతాల సర్వే నంబర్‌, ప్రాంతం, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించుకొని దరఖాస్తులోని వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వాటికి ఫీ జులను నిర్ణయించి, అర్హత లేని వాటిని తిరస్కరించే అ వకాశం ఉన్నది.


పెరగనున్న డిమాండ్‌

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లు, ఇళ్లకు రిజిస్ట్రేషన్‌లు చేయబోమని ప్రకటించడంతో, చా లా ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆ త రువాత రూ.వెయ్యి కట్టించుకొని రిజిస్ట్రేషన్లకు అనుమ తి ఇచ్చింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వేలల్లో దరఖా స్తులు వచ్చాయి. అప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా రు. తాజాగా దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడంతో ప్రజల్లో మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌పై చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉండే ప్లాట్లు, ఇళ్లకు డిమాండ్‌ ఉంది. మార్కెట్లో కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ ఉన్న వాటికి, ఎ ల్‌ఆర్‌ఎస్‌ లేని వాటికి ధరల్లో కూడా తేడా ఉంది. దీ నికితోడు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటే విక్రయించుకోవడం కూడా సులభమవుతుంది. అదే విధంగా ఇళ్ల విషయంలోనే ఎ ల్‌ఆర్‌ఎస్‌ ఉన్న వాటికి మంచి డిమాండ్‌ ఉండటంతో, చాలా మంది ప్లాట్లు, ఇళ్లు ఉన్న వారు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు లు చేసుకున్నారు.

Updated Date - 2021-07-22T03:56:29+05:30 IST