Advertisement

రిపీట్ చేస్తున్న స‌మంత‌..?

Oct 14 2020 @ 19:01PM

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘ఓబేబీ’. గ‌త ఏడాది జూలైలో ఈ సినిమా విడుద‌లైంది. ఆ త‌ర్వాత స‌మంత నటించ‌లేదు. సరిక‌దా.. కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయ‌లేదు. కొన్ని రోజుల ముందు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ తెలుగు, త‌మిళ‌, హిం‌దీ భాష‌ల్లో సామ్ ఓ సినిమా చేయ‌నుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా డైరెక్ట‌ర్ మారాడ‌ట‌. అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ స్థానంలో నందినీ రెడ్డియే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. హారర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టాక్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోనీపిక్చ‌ర్స్ నిర్మించబోయే ఈ చిత్రాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంద‌ట‌. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.