Pushpa సినిమాలోని ఊ..అంటావా.. పాటకి Salman Khan రియాక్షన్.. వెంటనే Samantha రెస్పాన్స్..!

Published: Mon, 27 Jun 2022 14:16:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Pushpa సినిమాలోని ఊ..అంటావా.. పాటకి Salman Khan రియాక్షన్.. వెంటనే Samantha రెస్పాన్స్..!

టాలీవుడ్ స్టార్స్‌ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప పార్ట్ 1: ది రైజ్’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్, హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోయారు. అలాగే.. ఈ మూవీలోని స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ.. అంటావా మావా’ కూడా మంచి పాపులర్ అయ్యింది. ఈ పాటతో టాలీవుడ్ హీరోయిన్ సమంత సైతం దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆ పాటలోని తన బోల్డ్ మూవ్స్‌తో ఆడియన్స్‌ మనసులని కట్టిపడేసింది. ఈ సూపర్ హిట్‌ సాంగ్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించాడు.


ఇటీవలే దుబాయ్‌లో జరిగిన IIFA 2022 అవార్డుల ఫంక్షన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో హోస్ట్ మాట్లాడుతూ.. ‘ఇటీవల మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన పాట ఏది?’ అని అడుగుతుంది. దానికి సల్లు భాయ్ ‘ఊ.. అంటావా మావా’ పాటని పాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతూ చివరికీ సమంత దగ్గరకు చేరింది. వెంటనే సమంత రిప్లైగా మూడు రెడ్ హార్ట్ సింబల్స్‌ని షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పాటను కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ సైతం.. ‘ధన్యవాదాలు డియర్ సల్మాన్ భాయీ’ అంటూ స్పందించాడు. కాగా.. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే.. సమంత సైతం ‘శాకుంతలం’ అనే పౌరాణిక కథ, ‘యశోద’ అనే థ్రిల్లర్‌, విజయ్ దేవరకొండతో ‘ఖుషీ’తోపాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...