అధికారులకు సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గన్నవరం, జనవరి 19 : నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉన్న తాధికారులకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విన్నవించారు. బుధవారం విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్, కలెక్టర్ జె.నివాస్, సబ్ కలెక్టర్ మాధవీలత, సీఆర్డీఏ కమిషనర్, ఎయిర్పోర్టు డైరెక్టర్, నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ ఎస్ఈలతో సమా వేశం నిర్వహించి సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఉన్న తాధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.