Advertisement

చెకుముకి టాలెంట్‌ పరీక్షల్లో సంబేపల్లె విద్యార్థుల ప్రతిభ

Feb 25 2021 @ 23:42PM

సంబేపల్లె, ఫిబ్రవరి 25: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం మండలస్థాయి చెకుముకి టాలెంట్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో సంబేపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన జ్ఞానజ్యోతి, రెడ్డినిఖితారెడ్డి, సాయికీర్తన అనే విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేధిక కన్వీనర్‌ పూజారి రామయ్య, మండల అధ్యక్షుడు మార్ల ఓబుల్‌రెడ్డి, సైన్స్‌ ఉపాధ్యాయులు ఉమాదేవి, నబీసాహెబ్‌లు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.