అంబరాన్నంటిన సంబురాలు

ABN , First Publish Date - 2021-10-17T04:19:33+05:30 IST

జిల్లా వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు శు క్రవారం కనుల పండువగా జరుపుకున్నారు.

అంబరాన్నంటిన సంబురాలు
శివపార్వతుల ఉత్సవ విగ్రహాల పల్లకీ సేవలో పాల్గొన్న కృష్ణదేవ రావు, మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా/వనపర్తి రూరల్‌, అక్టోబ రు 16:జిల్లా వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు శు క్రవారం కనుల పండువగా జరుపుకున్నారు. విజయదశమి రోజు సాంప్రదాయం ప్రకారం ప్రతీ గ్రామం లో సాయంత్రం శమీపూజలు చేశారు. జిల్లా కేంద్రం లోని వనపర్తి సంస్థాన వారసుల బంగ్లా కృష్ణదేవరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి దేవతా మూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల విగ్రహాలను పల్లకీలో ఊరే గింపుగా పాతబజారులో ఉన్న శమీవృక్షం వద్దకు చేరు కున్నారు. శమీవృక్షం ముందు శివపార్వతుల ఉత్స వ విగ్రహాలను ఉంచారు. సంస్థాన వారసులు కృష్ణదేవరావు, మంత్రి నిరంజన్‌రెడ్డి,  మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌లు పూజ లు చేశారు. అనంతరం శమీ వృక్షానికి హారతులు ఇచ్చి పత్రిని పట్టణ ప్రజలకు పంచిపెట్టారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, చిన్నారెడ్డి, ప్రజలకు కృష్ణదేవ రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు నల్లచెరువు కట్టపై నూతనంగా నాటిన శమీ వృక్షానికి పూజలు చేశి శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు. పట్టణంలోని నందిహిల్స్‌ కాలనీలో దశమి వేడుకలు నంది హిల్స్‌ అభివృద్ధ్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్కులోని శమీ వృక్షం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమానికి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ ముఖ్యఅతిథిగా హాజర య్యారు.  పూజ అనంతరం కాలనీ వాసులు శమీ పత్రిని స్వీకరించి ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్ష లు తెలుపుకున్నారు. పూజ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్‌ గౌడు, కౌన్సిలర్లు, వివిధ  పార్టీల నాయకులు  పాల్గొన్నారు.

మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల, చిట్యాల, అచ్యుతాపూర్‌, సవాయిగూడెం తదితర గ్రామాల్లో శుక్రవారం విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయా ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శమీ వృక్షానికి పూజలు చేసి శమీపత్రాన్ని ఒకరికొకరు పం చుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమం లో సర్పంచ్‌లు కొండన్న, హరిత, శారద, భానుప్రకా ష్‌, ఎంపీటీసీ కురుమూర్తి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.  పెద్దగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ యువజ న రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి దుర్గామాతను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కొం డన్న, కాంగ్రెస్‌ నాయకులు రొయ్యల శివన్న, రమేష్‌, పసుపుల నవీన్‌కుమార్‌ స్వామి పాల్గొన్నారు. 

కొత్తకోటలో..

కొత్తకోట : మండలంలో దసరా ఉత్సవాలు శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. అయా గ్రామాలలో శమీ చెట్టువద్దకు ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఒక రికొకరు శమీ పత్రాల ను పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలు పుకున్నారు. కొత్తకో టలో పాత చావిడి వద్ద ఆయుధపూజ నిర్వహించారు. శోభయాత్రగా కో దండ రామస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద హిందూ ధ్వజం ఎగురవేశారు. అక్కడి నుంచి బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో శమీ వృక్షాని కి  పూజలు చేశారు. శమీతో విజయ దశమి శుభా కాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని, వైస్‌చైర్‌పర్సన్‌ జయమ్మ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ, మార్కెట్‌ చైర్మనులు చెన్నకేశవరెడ్డి, బాలనా రాయణ, నాయకులు విశ్వేశ్వర్‌, నారాయణమ్మ, సంధ్య, బాబురెడ్డి, నిర్మల, ఆద్వా ని శ్రీను, గొల్లబా బు, ప్రశాంత్‌, కృష్ణారెడ్డి, మేస్త్రీ శ్రీను, వేముల శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, భరత్‌ భూషణ్‌, వెంకట్‌ రెడ్డి,  శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌ ఉన్నారు.  

పాన్‌గల్‌లో..

మండలంలో విజయదశమి వేడుకలు శుక్ర వారం  ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో శమీ వృక్షాలకు ప్రత్యేక పూజలు చే శారు. మండల కేంద్రంలోని శమీ వృఽక్షం దగ్గర ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌ సింగిరెడ్డి గో పాల్‌ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శమీ పత్రాలను ఇస్తూ శుభా కాంక్షలు తెలుపుకు న్నారు. 

ఆత్మకూరులో.. 

మండలంలోని ఆయా గ్రామాల్లో  ప్రజలు విజయదశమి వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు. శమీ చెట్టుకు ప్రత్యేక పూజ లు చేసి శమీ పత్రాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. పట్టణ కేంద్రంలోని పరమేశ్వర స్వామి ఆలయంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గాయత్రి, వైస్‌ చైర్మన్‌ విజ య భాస్కర్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ చెడుపై మంచి గెలిచిన రోజును ప్రతీ ఒక్కరు గుర్తించి సంస్కృతి సాంప్రదాయాలను గౌర వించాలన్నారు.  అనంతరం నవరాత్రుల పూజల సందర్భంగా అమ్మవారి ఊరే గింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయా వార్డుల్లో కౌన్సిల ర్లు, పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. 

పెబ్బేరు రూరల్‌/శ్రీరంగాపురంలో...

శ్రీరంగాపురం, పెబ్బేరు  మండలాల్లోని గ్రామాల లో దసరరా వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవా రం శమీ పూజలు చేశారు.  ఆలయాలకు వెళ్లి పూజ లు నిర్వహించారు. శ్రీరంగాపురం ఆలయానికి భక్తు లు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు.  

అమరచింతలో..

మండల కేంద్రంలో విజయదశమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. శుక్రవారం సాయంత్రం శమీ కట్ట దగ్గర శమీవృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు శమీ ఇస్తూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  మండల కేంద్రంలో కాళికాదేవి ఆలయం నుంచి దుర్గామాతను దశమి కట్ట వరకు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మేర్వరాజు, రమేష్‌, అనీల్‌కుమార్‌, తిరుమల ప్రకాష్‌, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పెద్దమందడిలో...

మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో విజయదశమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పామిరెడ్డిపల్లిలో శనివారం దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. మండల కేంద్రంలోని దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వా హకులు భాస్కర్‌శర్మ తెలిపారు.కార్యక్రమంలో పామి రెడ్డిపల్లి నవరాత్రి ఉత్సవ  నిర్వాహకులు మాజీ ఎం పీపీ మన్యపురెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌, ప్రజాప్రతినిధులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 

 వీపనగండ్లలో..

వీపనగండ్ల : మండలంలో శుక్రవారం విజయ దశమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధ్దలతో జరుపుకు న్నారు. ఆలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. మండల కేంద్రంలో చెన్నకేశవస్వామిని ఊరేగింపుగా శమీవృక్షం వద్దకు తీసుకువెళ్లి పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యం గా ఉండాలని కోరుతూ పూజలు చేశారు. 

Updated Date - 2021-10-17T04:19:33+05:30 IST