అవే కష్టాలు!

ABN , First Publish Date - 2022-08-14T07:34:19+05:30 IST

నెలరోజుల వ్యవధిలో రెండోసారి వరద ముంపును ఎదుర్కొంటున్న అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనా తీతం.

అవే కష్టాలు!
అప్పనపల్లి బాలబాలాజీ ఆలయం చుట్టూ చేరిన వరదనీరు

లంక గ్రామాల ప్రజలకు పెరుగుతున్న వరద కష్టాలు

 నెల రోజుల వ్యవధిలో రెండోసారి ముంచెత్తిన వరద

 రోడ్లపైకి చేరుతున్న నీరు 8 రంగంలోకి రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

నెలరోజుల వ్యవధిలో రెండోసారి వరద ముంపును ఎదుర్కొంటున్న అంబే డ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనా తీతం. కొన్ని రోజుల కిందట రికార్డుస్థాయిలో వచ్చిన వరదల్లో తీవ్ర నష్టాలు చవిచూసి ఇళ్లకు చేరుకుని వాటిని శుభ్రం చేసుకున్న బాధితులకు మరోసారి ముంచుకొచ్చిన వరద ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే సర్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న లంక గ్రామాల ప్రజలు మళ్లీ వరద తాకిడితో అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఈసారి పునరావాస కేంద్రాలు ఏర్పా టు చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన కాజ్‌వేల వద్ద మాత్రం కొన్ని పడవలను ఏర్పాటుచేశారు. గత మూడు రోజుల నుంచి వరద ప్రవాహం నిల కడగా కొనసాగుతుండడంతో లంక గ్రామాల్లోని ప్రధాన రహదారులు, అంత ర్గత రహదారుల్లోకి నీరు చేరింది. మరోవైపు ప్రజలు ఇప్పటికే అనారోగ్యాల బారిన పడుతున్నారు. పశువుల పరిస్థితి దారుణంగా ఉంది. పశుగ్రాసం కొరత వల్ల ఇప్పటికే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న రైతులు మళ్లీ నెల వ్యవధిలో రెండోసారి వరదతో బెంబేలెత్తిపోతున్నారు. కాగా శనివారం కోనసీమకు వరద నిలకడగా కొనసాగుతూ గ్రామాలను ముంచెత్తుతోంది. పౌర్ణమి కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నందున వరద ప్రవాహం పెద్దగా సముద్రంలోకి దిగకపోవడంతో వరద ముంపు పెరిగింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సుమారు 40కు పైగా లంక గ్రామాలను వరదనీరు ముం చెత్తింది. కాజ్‌వేలన్నీ నీట మునిగాయి. అప్పనపల్లి, కనకాయలంక, ఎదురు బిడియం, కె.ఏనుగుపల్లి, అప్పనరామునిలంక కాజ్‌వేలు నీట మునగడంతో ప్రయాణాలు స్తంభించాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానం చుట్టూ వరదనీరు రావడంతో దర్శనాలు నిలిపివేశారు. అలాగే పాశర్లపూడిలోని కనకదుర్గమ్మ ఆలయంతోపాటు పక్కనే ఉన్న పర్యాటక భవనం కూడా నీట మునిగింది. లంక గ్రామాల్లో పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినవిల్లి, పి.గన్నవరం, మామి డికుదురు, ముమ్మిడివరం మండలాల్లో పెళ్లి బృందాలవారు బయటి ప్రాంతా లకు తమ వేదికలను మార్చుకుని వివాహాలు చేసుకుంటున్నామని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా  విద్యార్థులు సైతం తీవ్రంగా ఇబ్బందులకు గుర వుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేని పరిస్థితులను ఎదుర్కొంటు న్నారు. ప్రధాన కాజ్‌వేలపై వరదనీరు పోటెత్తడంతో రవాణా వ్యవస్థ స్తంభించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు పి.గన్నవరం మండలంలో 11 ప్రాం తాలు జలదిగ్భందానికి గురికావడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏడుచోట్ల పడవలు ఏర్పాటుచేసి లంక గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించిం ది. లంకాఫ్‌ఠాణేల్లంక, గురజాపులంక, గేదెల్లంక, చింతపల్లిలంకలతో సహా అనేక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నుంచి వరద పోటెత్తడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా రు. అల్లవరం మండలం పల్లిపాలెంలో మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. కాట్రేనికోన మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 25 ఇళ్లు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసం తరాయుడు, కొత్తపేట ఆర్డీవో ఎం ముక్కంటితో సహా అధికారులు పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. అయినవిల్లి, పి.గన్నవరంలలో ఎన్టీఆర్‌ఎఫ్‌ బలగా లు మోహరించాయి. ప్రధాన రేవుల్లో పడవ ప్రయాణాలను నిలిపివేశారు.ఔ



Updated Date - 2022-08-14T07:34:19+05:30 IST