అదే.. ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2022-06-16T05:25:51+05:30 IST

బాసరలో ఏర్పాటైన రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిబుల్‌ ఐటీ)లో అదే ఉద్రిక్త పరి స్థితులు కొనసాగుతున్నాయి. రెండోరోజు బుధవారం విద్యార్థులు ఆందోళ న చేశారు. తరగతులను బహిష్కరించి బైఠాయించారు. ప్రధాన గేటు వ ద్ద దినమంతా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. నిరసనలో పాల్గొంటున్న వేలాది మంది విద్యార్థులతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఎస్‌ఐలు, సీఐలు ప్రత్యేక బలగాలను క్యాంపస్‌లో మొహరించారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు.

అదే.. ఉద్రిక్తత..
నిరసన తెలుపుతున్న విద్యార్థులు

బాసర  ట్రిబుల్‌ ఐటీలో రెండోరోజూ కొనసాగిన విద్యార్థుల ఆందోళన 

ముగ్గురు మంత్రులు హామీ ఇచ్చినా.. విరమించని ఆందోళన 

పలుమార్లు విద్యార్థులతో కలెక్టర్‌ చర్చలు జరిపినా విఫలం 

బాసర, జూన్‌15:  బాసరలో ఏర్పాటైన రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిబుల్‌ ఐటీ)లో అదే ఉద్రిక్త పరి స్థితులు కొనసాగుతున్నాయి. రెండోరోజు బుధవారం విద్యార్థులు ఆందోళ న చేశారు. తరగతులను బహిష్కరించి బైఠాయించారు. ప్రధాన గేటు వ ద్ద దినమంతా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. నిరసనలో పాల్గొంటున్న వేలాది మంది విద్యార్థులతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఎస్‌ఐలు, సీఐలు ప్రత్యేక బలగాలను క్యాంపస్‌లో మొహరించారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. 

సోషల్‌ మీడియా వేదికగా విద్యార్థుల పోరు 

క్యాంపస్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులు సోషల్‌ మీడియాను వినియోగించుకుంటున్నారు. ట్విట్టర్‌, ఫే స్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో నిరసన కార్యక్రమాలను ప్ర చారం చేస్తున్నారు. ట్విట్టర్‌లలో బాసర ఘటన మోత మోగుతుంది. 5 వేల మంది విద్యార్థుల వేల ట్విట్‌లు చేస్తున్నారు. వీరికి పూర్వవిద్యార్థులు మద్దతు పలుకుతున్నారు.

ముగ్గురు మంత్రులు హామీలిచ్చినా..

విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మం త్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్పందించారు. మంత్రి కేటీఆర్‌ సమస్యలన్నీంటిని పరిష్కరించి మంచి విద్య అందేలా చూస్తామని ట్విట్టర్‌ వేదికగా హామీ ఇచ్చారు. ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జాతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్‌ చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స మస్యలన్నీంటిని త్వరలోనే పరిష్కరించనున్నట్లు ప్రకటించారు. మంత్రు ల హామీలను యూనివర్సిటీ అధి కారులు విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన విరమించాలని కోరారు. హామీ లు కాదు.. సమస్యల పరిష్కారమే ముఖ్య మంటూ ఆందోళన కొనసాగించారు. 

ఫలించని కలెక్టర్‌ చర్చలు..

ట్రిబుల్‌ ఐటీని బుధవారం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫా రూఖీ సందర్శించారు. యూనివర్సిటీ కార్యాలయంలో విద్యార్థు లతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారం కోసం రూ.10 లక్ష లు మంజూరు చేస్తామని మిగితా సమస్యలను కూడా పరిష్కరించను న్నట్లు భరోసా ఇచ్చారు. అందుకు ఒప్పుకోని విద్యార్థులు సీఎం వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇలా పలుమార్లు కలెక్టర్‌ విద్యార్థులతో చర్చలు జరిపినా ఆందోళనను విరమించలేదు. 

భారీ బందోబస్తు.. ఎక్కడికక్కడే నేతల అరెస్టులు 

విద్యార్థుల వద్దకు ఎవరూ రాకుండా వర్సిటీ వద్ద బందోస్తు ఏర్పాటు చేశారు. లోనికి అనుమతించడం లేదు. బీజేపీ నాయకుడు మోహన్‌ రావు పటేల్‌తో పాటు ఇతర నాయకులను పోలీసులు భైంసాలో హౌస్‌ అరెస్టు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుకొని స్టేషన్‌కు తరలిం చారు. గోదావరి వంతెన వద్ద పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 

డిమాండ్ల విలువ రూ.కోట్లు 

విద్యార్థులు 12 రకాల డిమాండ్లను అధికారుల ముందుంచారు. అం దులో చాలా వ రకు వారికి అన్ని అత్యవస రమని చెప్పవచ్చు. రెగ్యులర్‌ వీసీని నియ మించాలని, క్యాంపస్‌లోనే ఉండాలని, అధ్యాపకుల సం ఖ్యను పెంచాలని, ఇన్ఫర్మెషన్‌ టెక్నా లజీ ఆధారిత విద్యను అందించాలని, హాస్టల్‌ తరగతి గదులకు మరమ్మతులు చే యాలని, ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్‌లు, మం చాలు, బెడ్‌లు అందించాలని, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, పీటీలను నియమించాలని వి ద్యా ర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. మూడేళ్ల నుంచి నాలుగున్నర వేల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్స్‌, ఇతర వస్తు సామగ్రి అందడం లేదు. నెల రోజుల్లో మరో 1500 మంది విద్యార్థులు కొత్తగా చేరనున్నారు. వీరికి కూడా ఇవన్నీ అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సమస్యలు పరిష్కారం కావాలంటే రూ.20 కోట్ల వ్యయం అవుతుందని యూనివ ర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-16T05:25:51+05:30 IST